: రామోజీరావు అంటే నాకు చాలా ఇష్టం: వెంకయ్యనాయుడు
ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడరాదని వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో విలేకరులతో నిర్వహించిన ఆత్మీయ కలయిక సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఉప రాష్ట్రపతి అయ్యానని చెప్పారు. రాజ్యసభలో అర్థవంతమైన చర్చ జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా జీవనంలోకి వస్తే దేశానికి అవసరమైన విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు. దేశంలో ఉన్న పత్రికాధిపతుల్లో ఈనాడు అధినేత రామోజీరావు అంటే తనకు ప్రత్యేక అభిమానమని తెలిపారు. తాను పని రాక్షసుడినని, దేశంలోని 623 జిల్లాలు తిరిగానని చెప్పారు. బీజేపీ సంక్షోభంలో ఉన్న సమయంలో కూడా తాను కీలకపాత్ర పోషించానని తెలిపారు.