: యాదాద్రి భువనగిరి జిల్లాలో తలలు పగలగొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఆసుపత్రికి తరలింపు
యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారడంతో, ఆ పార్టీ నేతలు చితక్కొట్టుకున్నారు. ఈ సమావేశం ఎస్సీ సెల్ జాతీయ అధ్యక్షుడు ప్రశాంత్, సీనియర్ నేత మల్లు రవి సమక్షంలో జరిగింది. సమావేశం జరుగుతుండగానే దేవరకొండకు చెందిన కాంగ్రెస్ ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ జగన్నాథ్‌నాయక్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలి భర్త నారాయణ గొడవ పడి ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు. అంతటితో ఆగకుండా కర్రలతో దాడి చేసుకుని తలలు పగిలేలా కొట్టుకున్నారు. రక్తమోడుతుండగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.