: నిజమే, బైక్ మీద అయితే బోల్ట్ ని ధోనీ అందుకోగలడు: జయవర్ధనే సెటైర్


ప్రపంచ అథ్లెెటిక్ ఛాంపియన్ షిప్ 100 మీటర్ల పరుగు పందెంలో కాంస్యంతో సరిపెట్టుకున్న బోల్ట్ ప్రదర్శనతో అభిమానులు నిరాశ చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు బోల్ట్ ను విమర్శించారు. ముందు క్వాలిఫైయింగ్ రౌండ్ లో లెగ్ బాక్స్ ను బోల్ట్ తప్పుపట్టిన నేపథ్యంలో ఫైనల్ రేసులో ఎందుకు నిరాశపరిచావంటూ విమర్శించారు.

అయితే, నెటిజన్ల తీరుపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ జయవర్థనే మండిపడ్డాడు. అభిమానుల తీరును తప్పు పట్టాడు. బోల్ట్ సాధించిన విజయాలను పక్కనబెట్టి ఒక్క రేసు గురించి విమర్శించడం సరికాదని హితవు పలికాడు. ఈ నేపథ్యంలో 'బోల్ట్ ను గౌరవించండి' అంటూ జయవర్థనే ఒక ట్వీట్ చేశాడు. దీనిపై ఒక అభిమాని 'బోల్ట్ కంటే వేగంగా పరుగెత్తే ధోనిని కూడా గౌరవించండి' అని కామెంట్ చేశాడు. అతనికి జయవర్థనే సమాధానమిస్తూ... 'నిజమే, ధోనీ బైక్ పై బోల్ట్ ని అందుకోగలడు' అని సెటైర్ వేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News