: జగన్ ప్యాంటు, షర్ట్ ఊడదీయడం ఖాయం: ఆదినారాయణరెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ అధినేత జగన్ ప్యాంటు, షర్టులను ఓటర్లు ఊడదీయడం ఖాయమని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్ మతి స్థిమితం కోల్పోయాడని, అపరిచితుడిలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వంద సిమెంట్ ఫ్యాక్టరీలను పెట్టాలని జగన్ ప్రయత్నించాడని అన్నారు. నంద్యాలలో 15 రోజుల పాటు జగన్ ప్రచారం చేసినా... ఆ పార్టీకి ఓటమి తప్పదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పార్టీ అధినేత హోదాలో నంద్యాల ప్రచారానికి వస్తారని తెలిపారు. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఆదినారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. తాను చేసిన విమర్శలను రాత్రి నిద్రపోయేముందు ఆమె గుర్తుకు తెచ్చుకోవాలని... అది గుర్తు చేసుకుంటే ఆమెకే నిద్ర పట్టదని అన్నారు. కేశవరెడ్డి విద్యా సంస్థల మాజీ అధినేత కేశవరెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని... అధిక వడ్డీలకు ఆయన బలయ్యారని తెలిపారు.