: నేను పక్కా లోకల్!: కేటీఆర్
నేరెళ్ల ఘటన దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. దళితులను ప్రభుత్వం టార్గెట్ చేయలేదని... జరిగిన ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. నేరెళ్ల ఘటనలో దోషులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరెళ్ల బాధితులను నేడు కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరెళ్ల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని... తన నియోజకవర్గ ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరని చెప్పారు.
రాష్ట్రంలోని విపక్షాలన్నీ టూరిస్టులైతే, తాను మాత్రం పక్కా లోకల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇసుక ద్వారా 45 ఏళ్లలో ఎన్నడూ రాని ఆదాయం ఈ మూడేళ్లలో వచ్చిందని ఆయన అన్నారు. ఇసుకను అక్రమంగా తరలించారని విపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయని... మిడ్ మానేరు ప్రాజెక్టు కోసమే ఇసుకను తరలించామని చెప్పారు.