: దీపికా పదుకునేకు ఆమె తండ్రి రాసిన లేఖ గుజరాత్ లో విద్యార్థులకు పాఠ్యాంశం!


ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపిక పదుకునేకు ఆమె తండ్రి, ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రకాశ్‌ పదుకునే రాసిన లేఖ ఒకటి ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ లో ఓ పాఠ్యాంశమై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఆమధ్య ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో తన జీవితంలో తన తండ్రి ప్రకాశ్‌ పదుకునే ప్రభావం ఎంతో ఉందని చెప్పింది. తన తండ్రి తమకు ఎంతో స్వేచ్ఛనిచ్చారని చెబుతూ తీవ్ర ఉద్వేగానికి గురవుతూ, సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ప్రకాశ్ పదుకునే తనకు రాసిన లేఖను చదివి వినిపించిన సంగతి తెలిసిందే.

జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని, విమర్శలు, వ్యతిరేకత వచ్చినా కుంగిపోకుండా లక్ష్యం దిశగా సాగిపోవాలని సూచిస్తూ ఆ లేఖ సాగుతుంది. ఇప్పుడీ లేఖను గుజరాత్‌ ఇంటర్‌ బోర్డ్‌ సిలబస్‌ లో పాఠ్యాంశం చేసేశారు. దీనిని చూసిన ఆమె అభిమానులు, దాని కాపీని దీపిక ఫ్యాన్‌ క్లబ్‌ ట్విట్టర్ పేజీలో పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు ఆశ్చర్యపోతుండగా, దీపిక ఆ పాఠ్యాంశాన్ని రీట్వీట్‌ చేస్తూ ‘వావ్‌’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News