: విడుదలకు ముందే 'కబాలీ' రికార్డును బద్దలు కొట్టిన 'వీఐపీ-2'
గత సంవత్సరం విడుదలైన తన మామ రజనీకాంత్ హీరోగా నటించగా, విడుదలైన 'కబాలీ' చిత్రం రికార్డులను ఆయన అల్లుడు ధనుష్ తాజా చిత్రం 'వీఐపీ-2' విడుదలకు ముందే బద్దలు కొట్టింది. మలేషియాలో 'కబాలీ' చిత్రం 480 థియేటర్లలో విడుదల కాగా, మరో మూడు రోజుల్లో వెండితెరను తాకనున్న 'వీఐపీ-2' ఏకంగా 550 థియేటర్లలో విడుదలకు ముస్తాబైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం స్వయంగా తెలుపుతూ, థియేటర్ల సంఖ్యను మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సింగపూర్ లో చిత్రానికి 'పీ 13' సర్టిఫికెట్ లభించిందని, చిన్నారులు కూడా చిత్రాన్ని చూడవచ్చని అధికారిక ధ్రువపత్రం అందిందని, ఈ నేపథ్యంలో కలెక్షన్లు మరింతగా ఉంటాయని భావిస్తున్నామని పేర్కొంది. ఈ చిత్రంలో హాలీవుడ్ బ్యూటీ కాజోల్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, అమలాపాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.