nikhil: బిజినెస్ మేన్ కూతురుతో నిఖిల్ పెళ్లి!

'హ్యాపీడేస్'లో నలుగురు కుర్రాళ్లలో ఒకడిగా కనిపించిన నిఖిల్, ఆ తరువాత తనని తాను మలచుకున్న విధానం ఆశ్చర్యం కలిగించకమానదు. శరీరాకృతి విషయంలోను .. బాడీ లాంగ్వేజ్ విషయంలోను .. నటన విషయంలోను ఆయన తనకంటూ ఒక స్టైల్ ను ఏర్పరచుకున్నాడు. సక్సెస్ లతో పాటు యూత్ లో తనకంటూ క్రేజ్ ను తెచ్చుకున్నాడు.

అలాంటి నిఖిల్ కి పెళ్లి కుదిరినట్టుగా సమాచారం. హైదరాబాద్ లోని ఓ బిజినెస్ మేన్ కూతురు తేజస్వినిని  ఆయన వివాహం చేసుకోనున్నట్టు చెబుతున్నారు. ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నిశ్చితార్థం జరగనుందట. ఈ వేడుక పూర్తయిన తరువాత శుభలేఖలు పంచడం మొదలుపెడతాడని అంటున్నారు. అక్టోబర్ 1వ తేదీన నిఖిల్ వివాహం జరగనుందని చెప్పుకుంటున్నారు.      
nikhil

More Telugu News