: నేటి అర్థరాత్రి నుంచి సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి మూసివేత... మెట్రోపనులే కారణం!
మెట్రోపనులను ముమ్మరం చేసే ప్రయత్నంలో భాగంగా సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి వైపుగా నేటి అర్థరాత్రి నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. 15 రోజులపాటు ఈ నిబంధన అమల్లో వుంటుంది. అటువైపుగా వెళ్లే వాహనాలను ఆలుగడ్డ బావి, సంగీత్ థియేటర్ మార్గం వైపుగా మళ్లిస్తారు. అలాగే బోయిగూడ వైపు ఉన్న రైల్వేస్టేషన్‌ను ఉపయోగించుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. మెట్రోపనుల నేపథ్యంలో అమీర్‌పేట్‌లోని మైత్రివనం మార్గాన్ని కూడా మూసివేసిన సంగతి తెలిసిందే.