: శ్రీశాంత్ నమ్మకమే నిజమైంది... నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐని ఆదేశించిన కేరళ హైకోర్టు!


ప్రముఖ క్రికెటర్‌ శ్రీశాంత్‌ విశ్వాసమే గెలిచింది. తాను నిర్దోషినని, మళ్లీ క్రికెట్ లో అడుగుపెడతానని 2013లో నిషేధం ఎదుర్కొన్న తరువాత శ్రీశాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని నిర్ధారిస్తూ శ్రీశాంత్, అజిత్ చండిమాల్, అంకిత్ చవాన్ లను పోలీసులు అరెస్టు చేసి, తీహార్ జైలుకు తరలించారు.

 దీంతో బీసీసీఐ వారిపై జీవిత కాల నిషేధం విధించింది. అప్పటికి శ్రీశాంత్ మంచి ఫాంలో ఉన్నాడు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చాడు. అనంతరం ఈ కేసులో నిందితులపై బీసీసీఐ దశలవారీగా పలువురిపై నిషేధం ఎత్తివేసింది. దీంతో ఈ ఏడాది మార్చిలో తనపై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐని ఆదేశించాలని కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దానిని విచారించిన న్యాయస్థానం శ్రీశాంత్ పై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. 

  • Loading...

More Telugu News