: చేతకాని దద్దమ్మ చంద్రబాబు: రోజా నిప్పులు
రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపే అర్హత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణే లేకుండా పోయిందని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందంటూ సాక్షాత్తు టీడీపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు చెప్పుకున్నప్పటికీ, కాపాడుకోలేక పోయిన చేతకాని దద్దమ్మ చంద్రబాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని మహిళలంతా కలిసి చీల్చి చెండాడాలని... అప్పుడే మహిళలంతా కనీసం పట్టపగలైనా రోడ్డుపై నడిచే అవకాశం ఉంటుందని చెప్పారు.