: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన పిల్లలు, వితంతువులు
బడి పిల్లలు, బృందావనానికి చెందిన వితంతువులతో ప్రధాని నరేంద్ర మోదీ రాఖీ కట్టించుకున్నారు. ఆయన వీరితో కలిసి ప్రధానమంత్రి కార్యాలయంలో రక్షాబంధన్ పండగ జరుపుకున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. పిల్లలు, వితంతువులు ప్రధానికి రాఖీలు కడుతున్న ఫొటోలను పీఎంఓ షేర్ చేసింది.