: చేనేత సంబురాలను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ వస్త్ర ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు చేనేత దుస్తులను ధరించాలని పిలుపునిచ్చారు. మన దేశంలో వ్యవసాయరంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తున్నది చేనేత రంగమే అని చెప్పారు. చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని... ఈ రంగానికి రూ. 1280 కోట్ల బడ్జెట్ ను కేటాయించామని తెలిపారు. దాదాపు 40 వేల మంది చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడున్న అందరిచేత 'చేనేతను ప్రోత్సహిస్తాం' అంటూ ప్రతిజ్ఞ చేయించారు.