: రాఖీ సెలబ్రేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్
తన తమ్ముడు అమన్‌తో కలిసి రాఖీ పండుగను రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో రకుల్ అభిమానులతో షేర్ చేసుకుంది. తమ్ముడు అమన్ తో కలిసి దిగిన ఫొటోను రకుల్ పోస్ట్ చేసింది. `రాఖీ టైమ్ విత్ మై లవ్లీ మాన్‌స్టర్!! నాకు తమ్ముడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు` అంటూ రకుల్ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొంది. కాగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన రకుల్ నటించిన `జయ జానకీ నాయక` చిత్రం ఆగస్ట్ 10న విడుదల కానుంది.