: పన్నీరు సెల్వంతో ఫొటో కోసం... తిరుచ్చి ఎయిర్ పోర్ట్ లో కత్తితో యువకుడి హల్ చల్!


తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో ఈ రోజు ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. తొలుత అతడు విమానాశ్రయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పురిచ్చితలైవి అమ్మ వర్గం అధినేత పన్నీరు సెల్వంతో ఫొటో దిగాలనుకున్నాడు. అందుకు అక్కడున్న భద్రతా బలగాలు అనుమతించలేదు. దాంతో అతడు కత్తిని బయటకు తీసి బెదిరించాడు. ఈ ఘటనతో నివ్వెరపోయిన సీఐఎస్ఎఫ్ బలగాలు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ యువకుడిని తిరుచ్చి జిల్లా మున్నారుపురంకు చెందిన వాడిగా గుర్తించారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు.  

  • Loading...

More Telugu News