: ఎమ్మెల్యే టికెట్ కోసమే అన్నదమ్ములిద్దరూ వైసీపీలోకి వెళ్లారు: శిల్పా సోదరులపై అఖిలప్రియ ఫైర్

నంద్యాల ఉప ఎన్నిక ప్రచారపర్వం తార స్థాయికి చేరింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చిన తర్వాతే శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీలోకి జంప్ అయ్యారని ఆమె ఆరోపించారు.

ఎమ్మెల్యే టికెట్ కన్ఫామ్ కాకపోతే ఆయన టీడీపీలోనే ఉండిపోయేవారని ఎద్దేవా చేశారు. కేవలం ఎమ్మెల్యే టికెట్ల కోసమే అన్నదమ్ములిద్దరూ పార్టీ మారారని విమర్శించారు. తాను రాజకీయాల్లోకి ఎలా వచ్చానో అందరికీ తెలిసిందేనని... తన తల్లి చనిపోతే ఆమె స్థానాన్ని తనకు ఇచ్చారని చెప్పారు. తాను పోటీ చేసినప్పుడు టీడీపీ తనపై పోటీకి ఎవరినీ నిలపలేదని ఆమె గుర్తు చేశారు. 

More Telugu News