: హక్కా నూడుల్స్ తింటూ ఎంజాయ్ చేశా.. చైనా బాక్సర్‌ను హక్కాబక్కా చేశావ్.. విజేందర్ విజయంపై వీరేందర్!
భారత బాక్సింగ్ దిగ్గజం విజేందర్, చైనా బాక్సర్ మైమైతియాలి మధ్య శనివారం జరిగిన బౌట్‌పై టీమిండియా మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగినా విజయం సాధించినందుకు విజేందర్‌కు కంగ్రాట్స్ చెప్పాడు. ‘‘హక్కా నూడుల్స్ తింటూ నీ మ్యాచ్‌ను వీక్షించా. మైమైతియాలిని హక్కాబక్కా చేశావ్’’ అంటూ ప్రశంసలు కురిపించాడు.
కాగా, విజేందర్ సింగ్ బౌట్‌ను వీక్షించేందుకు బాలీవుడ్ కదిలొచ్చింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, రణ్‌దీప్ హుడా, గుల్షన్ గ్రోవర్, సోనూ సూద్, కరణ్ కుంద్రా, యోగా గురు బాబా రాందేవ్ తదితరులు హాజరయ్యారు.