: ‘మెర్సల్’ ఆడియో వేడుకలో రెహమాన్‌ ప్రత్యేక ప్రదర్శన!


నటుడు విజయ్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న తమిళ చిత్రం ‘మెర్సల్’. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ నెల 20న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ‘మెర్సల్’ ఆడియో రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై చిత్ర బృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడక పోవడం గమనార్హం. కాగా, విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘అదిరింది’ పేరిట విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News