: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిజమైన అభిమానులా?: తమ్మారెడ్డి భరద్వాజ
ఒకప్పుడు ఉండే అసలైన ఫ్యాన్స్ ఇప్పుడు లేరని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఒకప్పుడు రాజకీయ నాయకుల అభిమానులైనా, సినీ నటుల అభిమానులైనా తమ అభిమాన నేత లేదా హీరో ఏదైనా చెబితే దానిని జవదాటే వారు కాదని, ఇతరులను జవదాటనిచ్చేవారు కాదని ఆయన చెప్పారు. ఇప్పుడు అలాంటి అభిమానులు లేరని అన్నారు. పవన్ కల్యాణ్ వారిస్తున్నా ఆయనపైబడి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపేవారే ఇప్పుడు అభిమానులని ఆయన తెలిపారు.
వారికి తమ అభిమాన హీరో అన్నా, అభిమాన నేత అన్నా గౌరవం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాంటి అభిమానులు ఉంటే ఎంత? ఉండకపోతే ఎంత? అని ఆయన తీవ్రంగా కామెంట్ చేశారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులంతా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లడం ద్వారానే నిజమైన హీరోలుగా మారారని ఆయన గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ మొదటి నుంచి భద్రతతోనే బయటకు వెళ్లేవారని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం ఆయన భద్రత లేకుండా బయటకు వెళ్లరనే తాను అనుకుంటున్నానని, ఏవైనా తేడాలు చేస్తే, వారే వారిని అడ్డుకుంటారని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.