prabhas: 100 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకున్న 'బాహుబలి 2'

షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి 2' చిత్రం భాషా భేదం లేకుండా జనంలోకి దూసుకెళ్లింది. విడుదలైన ప్రతి చోట విజయవిహారం చేసింది. వసూళ్ల విషయంలో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. అలా ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, 100 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుని మరో రికార్డును సొంతం చేసుకుంది.

కంటెంట్ తో ఆడియన్స్ ను కాసేపు థియేటర్లో కూర్చోబెట్టడమే కష్టంగా వున్న ఈ రోజుల్లో ఈ సినిమా 100 రోజులను పూర్తి చేసుకుకోవడం విశేషం. 1700 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం మరో విశేషం. బలమైన కథా కథనాలు .. పాత్రలకి తగిన నటీనటులు .. వాళ్లు పండించిన హావభావాలు .. రాజమౌళి టేకింగ్ ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని అందించాయని చెప్పొచ్చు.    
Go Back to Shorts
prabhas

More Telugu News