: ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్... సాయంత్రం 5 వరకు పోలింగ్!
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటులోని లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఈ పోలింగ్ లో పాల్గొంటారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, యూపీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల కృష్ణగాంధీ పోటీలో ఉన్నారు. రాజ్యసభ, లోక్ సభలో కలిపి మొత్తం 785 మంది ఎంపీలలో మెజారిటీ సభ్యుల మద్దతు ఎన్డీయేకు ఉండడంతో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా గెలిచే అవకాశం ఎక్కువగా వుంది. ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు పూర్తి కానుండగా, ఆ వెంటనే లెక్కింపు ప్రారంభించనున్నారు. అనంతరం ఫలితం ప్రకటిస్తారు.