: సెలబ్రిటీ స్టేటస్ ఇబ్బందే... అభిమానుల కోలాహలంతో హంపీలో షెడ్యుల్ రద్దు చేసుకున్న అల్లు అర్జున్!
సెలబ్రిటీలు అందులోనూ ముఖ్యంగా సినీ తారలు తమ కుటుంబంతో కలిసి బయట స్వేచ్చగా తిరగలేరు. అభిమానులు చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అలాగే జరిగింది. తన కుటుంబంతో కలిసి బన్నీ నిన్న హంపీ వెళ్లాడు. అక్కడ విరూపాక్షేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కమల్ మహల్, రాతి రథం, విజయ విఠల ఆలయాలు సందర్శించారు.
అయితే, వీరు సందర్శనకు వెళ్లిన ప్రతి చోటా భారీ ఎత్తున అభిమానులు గుమికూడారు. ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. దాంతో సందర్శనను మధ్యలోనే రద్దు చేసుకుని, హోస్పేటలోని హోటల్ కు చేరుకున్నారు. నేడు మరికొన్ని స్మారక స్థలాలను చూసేందుకు వీరికి ఏర్పాట్లు చేశామని హంపి పోలీసులు తెలిపారు.