: ఐదేళ్లు ప్రేమలో ఉన్నాను... కానీ వర్కవుట్ కాలేదు!: సినీ నటి అర్చన
ఐదేళ్ల పాటు తాను ప్రేమలో ఉన్నానని సినీ నటి అర్చన తెలిపింది. బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న అర్చన సింగిల్ అని, అదే షోలో పాల్గొంటున్న ప్రిన్స్ కూడా సింగిల్ అని తోటి కంటెస్టెంట్స్ ఆటపట్టిస్తున్న నేపథ్యంలో... 'ఎన్నేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నావని ప్రిన్స్, అర్చనను అడిగాడు. ఐదేళ్లని చెప్పింది. అయితే మధ్యమధ్యలో బ్రేకప్ కూడా అయ్యేదని, కానీ ఐదేళ్ల పాటు ప్రేమలో ఉన్నానని, ఆ సమయంలో చాలా ఏడ్చేదానినని చెప్పింది.
ఒక జీవితానికి సరిపడా అనుభవాలన్నీ ఆ ప్రేమలో అనుభవించేశానని చెప్పింది. ఇప్పుడు తాను ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగలనని, వాటి ఫలితాన్ని తన మనసు వరకు రానివ్వలేనని స్పష్టం చేసింది. తానెంత అటాచ్డ్ గా ఉంటానో అంతే డిటాచ్డ్ గా కూడా ఉండగలనని చెప్పింది. తనకు ఏది ఉన్నా, లేకున్నా ఉండగలనని అనిపిస్తుందని అర్చన చెప్పింది. ఆమె మాటలతో ఆదర్శ్, ప్రిన్స్ కూడా ఏకీభవించారు.