: ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్: అరుణ్ జైట్లీ


భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడేలా పాకిస్థాన్ వారిని ఉసిగొల్పుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్నకు సమాధానంగా జైట్లీ వివరణ ఇస్తూ .. జమ్మూకాశ్మీర్ లోకి చొరబడుతున్న ఉగ్రవాదులకు భారత ఆర్మీ, బీఎస్ఎఫ్ దళాలు దీటుగా సమాధానం చెబుతున్నాయని అన్నారు. గత ఏడాదిలో పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు 228 సార్లు పాల్పడగా, ఈ ఏడాది ఎల్ఓసీ వెంబడి 285 సార్లు పాక్ ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు.

చొరబాట్ల నియంత్రణకు భారత ఆర్మీ తగిన చర్యలు తీసుకుంటోందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాడార్లు, ప్రత్యేక సెన్సార్ల ద్వారా చొరబాట్లను గుర్తించడం ద్వారా వాటిని భగ్నం చేస్తోందని చెప్పారు. సరిహద్దు భద్రత గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందని జైట్లీ చెప్పారు.

  • Loading...

More Telugu News