: జగన్ ప్రతిపక్ష నేత కాదు.. ప్రతినాయకుడు!: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర


వైసీపీ అధినేత జగన్ ప్రతిపక్ష నేతకాదు.. ప్రతినాయకుడని గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ఏపీని మరో బీహార్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని విమర్శించారు. ఏపీ సీఎం, తమ పార్టీ అధినేత చంద్రబాబుది అభివృద్ధి బాట అని కొనియాడారు. నంద్యాల ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం కాదు, ప్రజలే స్పందిస్తారని..సరైన సమాధానం చెబుతారని అన్నారు.

  • Loading...

More Telugu News