: తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. శ్రీలంక పతనం ప్రారంభం!
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొమ్మిది వికెట్లకు 622 పరుగులు సాధించిన భారత్ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లలో ధావన్ 35 పరుగులు, కేఎల్ రాహుల్ 57, పుజారా 133, కోహ్లీ 13, రహానే 132, అశ్విన్ 54, సాహా 67, పాండ్యా 20, షమీ 19 పరుగులు చేశారు. జడేజా 70, ఉమేష్ యాదవ్ 8 నాటౌట్ గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో హెరాత్ 4, పుష్పకుమార 2, కరుణరత్నే, పెరీరాలు చెరో వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన శ్రీలంక ఆదిలోనే తడబాటుకు గురైంది. ఓపెనర్ తరంగా డకౌట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కరుణరత్నే (7), మెండిస్ (2) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుత స్కోరు ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు.