: వీరిద్దరి వల్ల చంద్రబాబుకు ప్రాణహాని ఉంది: బుద్ధా వెంకన్న
వైసీపీ అధినేత జగన్, ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రిని చంపాలంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు వారి మనోభావాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యతను భుజాలపై వేసుకుని కష్టపడి పని చేస్తున్నందుకా చంపమంటున్నారు? జగన్ లా లక్ష కోట్లను దోచుకుని, ఆయనలా 16 నెలలు జైలు శిక్షను అనుభవించలేదనా చంపమంటున్నారు? అని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో చంద్రబాబు ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి అనే విషయం తేలిందని... ఈ నేపథ్యంలోనే, నంద్యాలలో నిన్న జరిగిన సభలో చంద్రబాబును చంపాలని జగన్ వ్యాఖ్యానించాడని అన్నారు. చంద్రబాబు కనుసైగ చేస్తే... ఆయనపై ఎక్కడ విమర్శలు చేశారో, అక్కడే వారి నాలుకలు కోస్తామని హెచ్చరించారు.