: భర్త రహానే సెంచరీ చూసి ఫిదా అయిపోయిన రాధిక ఆనందమిది... వీడియో మీకోసం!


గత కొంత కాలంగా బ్యాటింగ్ లో రాణించి భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్న అజింక్య రహానే నేడు కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో సెంచరీ చేయడంతో, దాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆయన భార్య రాధిక ఆనందంతో కేరింతలు కొట్టింది. 17 టెస్టు ఇన్నింగ్స్ ల అనంతరం రహానే నేడు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ని వీఐపీ స్టాండ్స్ నుంచి తిలకించిన రాధిక, సెంచరీ పూర్తికాగానే లేచి నిలబడి చప్పట్లతో తన జీవిత భాగస్వామిని అభినందించింది. రాధిక ఆనందాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖతాలో పంచుకుంది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.


  • Loading...

More Telugu News