: 79 అంతస్తుల భవనం సగానికి పైగా కాలినా.. ఎవరికీ గాయాలు కాలేదు!

ప్రపంచంలోని అతి పెద్ద భవనాల్లో ఐదోదైన దుబాయ్ లోని మెరీనా టార్చ్ టవర్ లో ఈ ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. దుబాయ్ లోని పర్యాటక స్థలాల్లో ఈ భవనం కూడా ఒకటి. ఈ భవనంలో ఎక్కువగా విదేశీయులే నివసిస్తుంటారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే మంటలు వ్యాపించాయి. కొద్ది సేపటికే సగానికి పైగా భవనం మంటల్లో చిక్కుకుంది. అయితే, భవనంలో ఉన్న ఏ ఒక్కరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా వెల్లడించింది.

భవనంలోని అందరూ క్షేమంగా బయటపడ్డారని తెలిపింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. మరోవిషయం ఏమిటంటే, 2015లో కూడా ఇదే భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది.

More Telugu News