: నంద్యాల సభ సక్సెస్ కావడంతో.. టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారు: బొత్స
నంద్యాలలో నిర్వహించిన వైసీపీ బహిరంగసభ విజయవంతమైందని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన చక్రపాణిరెడ్డిని ప్రశంసించిన బొత్స... ఆయనను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ఒక పార్టీలో గెలిచిన వారు వేరే పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయడం నైతికత అని చెప్పారు. గతంలో కూడా తమ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించిన ఘనత వైసీపీదని అన్నారు. కర్నూలు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారని... వారిలో ఏ ఒక్కరితోనైనా రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. నంద్యాల సభ విజయవంతం కావడంతో టీడీపీ నేతలు షాక్ అయ్యారని... దీంతో, అవాకులు చెవాకులు పేలుతున్నారని అన్నారు.