: అతివేగ‌మైన 4జీ నెట్‌వ‌ర్క్‌ రిల‌య‌న్స్ జియో... ట్రాయ్ నివేదిక వెల్ల‌డి


టెలికాం నెట్‌వ‌ర్క్‌ల్లో రిల‌య‌న్స్ వారి జియో నెట్‌వ‌ర్క్‌ అత్యంత వేగంగా 4జీ ఇంట‌ర్నెట్ సేవ‌లు అందిస్తోంద‌ని టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) నివేదిక వెల్ల‌డించింది. జూన్ నెల‌లో జియో నెట్‌వ‌ర్క్ సెక‌నుకు 18 మెగాబిట్ల స‌రాస‌రి డౌన్‌లోడ్ స్పీడ్ అందించిన‌ట్లు నివేదికలో ఉంది. కేవ‌లం 8.91 ఎంబీపీఎస్ స‌రాస‌రి డౌన్‌లోడ్ స్పీడ్‌తో భార‌తీ ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ చివ‌రి స్థానంలో నిలిచింది. ఇటీవ‌ల ఓ ప్రైవేట్ సంస్థ నివేదిక‌లో ఎయిర్‌టెల్ అత్యంత వేగ‌వంత‌మైన 4జీ సేవ‌లు అందిస్తున్న నెట్‌వ‌ర్క్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

జియో త‌ర్వాత రెండో స్థానంలో వొడాఫోన్ నిలిచింది. కానీ వొడాఫోన్‌తో పోల్చిన‌పుడు జియో 68 శాతం మెరుగైన 4జీ సేవ‌లు అందిస్తున్న‌ట్లు ట్రాయ్ నివేదిక తెలిపింది. మూడో స్థానంలో ఐడియా, చివ‌రి స్థానంలో ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్‌లు ఉన్నాయి. గ‌త ఏడు నెల‌లుగా ట్రాయ్ స‌ర్వేల్లో జియో మొద‌టిస్థానంలో నిలుస్తోంది. ఇక 3జీ స్పీడ్ విష‌యంలో వొడాఫోన్ మొద‌టిస్థానంలో నిల‌వ‌గా, ఎయిర్‌టెల్‌, ఐడియా, ఎయిర్‌సెల్‌, బిఎస్ఎన్ఎల్ నెట్‌వ‌ర్క్‌లు త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి. `మై స్పీడ్‌` యాప్ ద్వారా వినియోగ‌దారుల నుంచి 4జీ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ట్రాయ్ సేక‌రిస్తుంది.

  • Loading...

More Telugu News