: చిరంజీవి పర్సనల్ లైఫ్ నాకు నచ్చదు: టీవీ నటి నీతూ
కోట్లాది మందికి అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవిపై టీవీ నటి నీతూ నారాయణ్ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ముఖ్యంగా మెగా అభిమానులకు ఈ కామెంట్లు చికాకును తెప్పిస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమెకు మీ అభిమాన హీరో ఎవరనే అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా ప్రశ్న కరెక్ట్ గా అడగడం నేర్చుకోండని చెప్పిన ఆమె... 'పవన్ కల్యాణ్ తర్వాత మీ అభిమాన హీరో ఎవరు?' అని అడగాలని చెప్పింది. తనకు పవన్ కల్యాణే అభిమాన హీరో అని... ఆయన తర్వాత చిరంజీవిని అభిమానిస్తానని తెలిపింది. యాక్టింగ్ పరంగా చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని... కానీ, పర్సనల్ లైఫ్ కి వచ్చే సరికి ఆయనంటే తనకు అంతగా ఇష్టం ఉండదని చెప్పింది. పవన్ కల్యాణ్ పెద్ద స్టార్ అని తాను అభిమానించడం లేదని... ఇతరులకు మంచి చేయాలనే గొప్ప గుణం పవన్ లో ఉందని నీతూ తెలిపింది. అందుకే పవర్ స్టార్ అంటే తనకు అంత క్రేజ్ అని... ఆయన తర్వాతే ఎవరైనా అని చెప్పింది.
సినిమాలు హిట్ అయినంత మాత్రాన పెద్ద హీరోలు కాదని... హెల్పింగ్ నేచర్ ఉన్నవారే రియల్ హీరో అని నీతూ అంది. ఏ ఊర్లో ఎలాంటి సమస్య ఉన్నా పవన్ కల్యాణ్ వెంటనే స్పందిస్తారని... కష్టాల్లో ఉన్న సీనియర్ నటులకు కూడా ఆయన ఎంతో సాయం చేశారని తాను విన్నానని చెప్పింది. పెద్ద హీరోగా చెలామణి అవుతూ, ఎంత డబ్బు సంపాదించినా ఏం లాభమని ప్రశ్నించింది. ఇదే సమయంలో యంగ్ హీరోలపై ఆమె విమర్శలు గుప్పించింది. కొంత మంది హీరోలు ఒకటి, రెండు సినిమాలు చేయగానే... సూపర్ స్టార్లుగా ఫీల్ అయిపోతున్నారంటూ కామెంట్ చేసింది.