: టీడీపీలో చేరిన నంద్యాల విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్


నంద్యాల ఉపఎన్నిక తరుణంలో టీడీపీలోకి కొత్త చేరికలు జరుగుతున్నాయి. తాజాగా, నంద్యాల విద్యా సంస్థల అధినేత ఇంతియాజ్ అహ్మద్ ఈ రోజు టీడీపీలో చేరారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న ఇంతియాజ్ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి టీడీపీలో చేరడం అభినందనీయమని అన్నారు.

కుప్పం తరహాలో నంద్యాలను అభివృద్ధి చేస్తామని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే దివంగత నేత భూమా నాగిరెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ, నంద్యాల అభివృద్ధిని కాంక్షించే ప్రతిఒక్కరూ టీడీపీకి అండగా నిలవాల్సిన సమయం ఇదేనని, ఈ ఉపఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు కోసం ముస్లిం మైనార్టీలందరూ కృషి చేస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News