: సీఎం కేసీఆర్ కు చిత్ర పరిశ్రమ రాసిన లేఖను పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్!
డ్రగ్స్ వ్యవహారంలో చిత్రపరిశ్రమకు చెందిన వారికి నోటీసులు రావడం, సిట్ అధికారుల విచారణ పూర్తి కావడం తెలిసిందే. అయితే, ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు తెలుగు చిత్ర పరిశ్రమ నిన్న ఓ లేఖ రాసింది. ఈ లేఖను ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
‘గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి చిత్ర పరిశ్రమ నుంచి చేస్తున్న విన్నపం..’ అంటూ ఈ లేఖను పవన్ పోస్ట్ చేశారు. ‘మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారికి.. తెలుగు సినిమా 2000 కోట్ల రూపాయలు దాటిన సంతోషంలో.. ఒక దర్శకుడికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంలో.. తెలుగు సినీ పరిశ్రమ వెలిగిపోతున్న సమయంలో..మమ్మల్ని కమ్మిన గ్రహణం - మాదక ద్రవ్యాల కేసు’ అంటూ ఈ లేఖ కొనసాగింది.