chiranjeevi: 'ఉయ్యాలవాడ'లో కీలక పాత్ర కోసం సుదీప్?

చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'ని తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కథానాయికలుగా ఐశ్వర్యరాయ్ .. నయనతారలను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక అమితాబ్ ను .. కన్నడ స్టార్ ఉపేంద్రను ఎంపిక చేసుకున్నారనే టాక్ వచ్చింది.

 తాజాగా .. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్ ను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలుగువాడై వుండి .. ఆంగ్లేయులకు సహకరించే పాత్ర కోసం ఆయనని అడుగుతున్నారట. తప్పకుండా ఆయన అంగీకరించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉపేంద్రను వేరే రోల్ కోసం తీసుకున్నారా? ఆయన బదులుగా సుదీప్ ను తీసుకోనున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.
chiranjeevi

More Telugu News