: పుజారా శతకం.. టెస్టుల్లో 13వ సెంచరీ చేసిన ఘనత!
శ్రీలంక-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా క్రికెటర్ ఛటేశ్వర పుజారా వంద పరుగులు పూర్తి చేసి, టెస్టు మ్యాచ్ ల్లో 13వ శతకం సాధించాడు. అదే సమయంలో, రహానె 50 పరుగులు సాధించాడు. పుజారా, రహానె భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతుండటమే కాకుండా, అద్భుతంగా రాణిస్తోంది. కాగా, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వికెట్లు పతనమైన అనంతరం, బరిలోకి దిగిన పుజారా, రహానెలు స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నారు. కాగా, టీమిండియా స్కోరు: 293/3.