: అమెరికాలో అమ్మకానికి ఇల్లు... 10 డాలర్లే... షరతులు వింటే మాత్రం దిమ్మతిరిగిపోద్ది!
ఓ ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. స్థలం నుంచి ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ, ఈ ప్రతిష్ఠాత్మక ఇల్లును మాత్రం కేవలం 10 డాలర్లకే విక్రయిస్తారట. కానీ అందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. వాటిని తెలుసుకుంటే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంతకీ విషయం ఏంటంటే... యూఎస్ లోని న్యూజెర్సీ మౌంట్ క్లెయిర్ లోని 44 ప్లీజెంట్ ఎవెన్యూలో ఉన్న ఈ ఇంటిని 20వ శతాబ్దపు తొలినాళ్ల ప్రముఖ ఆర్కిటెక్చర్ డుడ్లే ఎస్ 1906లో నిర్మించగా, యూఎస్ ఫుట్ బాల్ ప్లేయర్, తొలి అమెరికన్ - ఆఫ్రికన్ ఎఫ్బీఐగా చరిత్ర సృష్టించిన అబ్రే లూయిస్ ఇందులో నివసించారు.
ఇక ఈ ఇల్లు ఉన్న స్థలాన్ని స్థానిక హౌసింగ్ సొసైటీ అభివృద్ధి చేయాలని భావించింది. ఇక ఇంత ప్రతిష్ఠాత్మక ఇంటిని 10 డాలర్లకే విక్రయిస్తామని ఆఫర్ పెట్టింది. ఈ డబ్బిచ్చి ఇంటిని కొనుగోలు చేస్తే, వారు ఇంటికి మాత్రమే యజమాని అట. స్థలానికి కాదు. అదేం మెలిక?... ఆ ఇంట్లో ఉండిపోవచ్చుగా అనుకుంటున్నారా? అది కుదరదు. సొంత ఖర్చుతో, ఆ ఇంటిని అమాంతం పైకి లేపి, మరో చేటికి తీసుకెళ్లి పెట్టుకోవాలి. అది కూడా ఎక్కువ దూరంలో ఉండకూడదు. దగ్గర్లో ఆ ఇల్లు పట్టేంత స్థలాన్ని కొనుగోలు చేయాలి. ఇక ఇంటిని భవిష్యత్తులో ధ్వసం చేయకూడదు. ఇటువంటి షరతులు పాటించే వారు ఈ ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు మరి!