rana: పోటీకి భయపడాల్సిన పనే లేదు: రానా

విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ .. విలక్షణమైన పాత్రలతో తనని తాను మలచుకుంటూ రానా ముందుకెళ్తున్నాడు. ఆయన తాజా చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి' .. ఈ నెల 11వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఇదే రోజున బోయపాటి 'జయ జానకి నాయక' .. హను రాఘవపూడి 'లై' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దర్శకులుగా బోయపాటి .. హను రాఘవపూడి ఇద్దరూ సక్సెస్ లతో వున్నారు. తేజ మాత్రం కొంత గ్యాప్ తరువాత వస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో పై రెండు సినిమాలతో పోటీ పడటం గురించి రానా దగ్గర ప్రస్తావిస్తే, ఆయన తదైన శైలిలో స్పందించాడు. తన సినిమాలో వున్న కంటెంట్ ను మరొకరు టచ్ చేసే ఛాన్స్ లేదని అన్నాడు. ఎన్ని సినిమాలు పోటీలో వున్నా ఈ తరహా సినిమా మాత్రం ఉండదని చెప్పాడు. తమ సినిమా కంటెంట్ పై తమకి బలమైన నమ్మకం ఉందనీ .. అందువలన పోటీ వున్నా భయపడాల్సిన పనిలేదని చెప్పుకొచ్చాడు.
rana
kajal

More Telugu News