: కొలంబో టెస్ట్: తొలి వికెట్ కోల్పోయిన భారత్
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి వికెట్ ను కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ధావన్ ను పెరీర్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. 37 బంతులను ఎదుర్కొన్న ధావన్ 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో ఉన్న కేఎల్ రాహుల్ 24 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 21 పరుగులతో ఆడుతున్నాడు. రాహుల్ కు పుజారా జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు.