: టీమిండియాను తిట్టి... మహిళా క్రికెటర్లను హెచ్చరించిన శోభాడే!
ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన భారత మహిళా క్రికెట్ జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తుంటే ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు శోభాడే మాత్రం విభిన్నంగా స్పందించి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ‘ఓ దేవుడా! మా అద్భుత మహిళా క్రికెటర్లను క్లాస్ కమర్షియలైజేషన్ నుంచి రక్షించు. పురుష క్రికెటర్లను నాశనం చేస్తున్న అత్యాశ నుంచి దూరం చేయి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై విమర్శలు మొదలయ్యాయి. స్టార్ డమ్ నుంచి మహిళలు ఎందుకు లాభపడొద్దని ప్రశ్నించారు. పురుషుల్ని తక్కువ చేయకుండానే మహిళలను పొగడొచ్చు కదా? అని మరి కొందరు ఆమెకు సూచించారు.