: మరణించిన ఉగ్రవాది అబు దుజానా స్థానంలో అబు ఇస్మాయిల్.. అమర్‌నాథ్ యాత్ర సూత్రధారి ఇతడే!
ఇండియన్ ఆర్మీ చేతిలో హతమైన లష్కరే తాయిబా కమాండర్ అబు దుజానా స్థానంలో పాకిస్థాన్‌కు చెందిన అబు ఇస్మాయిల్ లష్కరే కమాండర్‌గా పగ్గాలు చేబట్టాడు. కశ్మీర్ డివిజన్ లష్కరే గ్రూపునకు ఇక నుంచి ఆయనే కమాండర్‌గా వ్యవహరించనున్నాడు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడికి సూత్రధారి ఇస్మాయిలే. ఆ ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన ఏడుగురిలో ఆరుగురు మహిళలే.