: ఎన్ఏసీ జ్యూయెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత!
చెన్నైకి చెందిన ఆభరణాల విక్రయ సంస్థ `ఎన్ఏసీ జ్యూయెలర్స్` తమ బ్రాండ్ అంబాసిడర్ గా నటి సమంతను ఎంచుకుంది. ఆగస్ట్ 2 నుంచి 27వరకు చెన్నైలో వీరు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో గతంలో బాగా పేరు పొందిన నగలను, ఆభరణాలను ఉంచనున్నారు. ఈ ప్రదర్శన ఆరంభ వేడుకలో సమంత పాల్గొంది. ఎన్ఏసీ వారు ప్రదర్శనకు ఉంచిన కొన్ని ఆభరణాలను ఆమెకు ప్రత్యేకంగా చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఏసీ వారి ప్రదర్శన గురించి, వారి ఆభరణాల గురించి వివరించారు.