: ఉత్తర కొరియాను ధ్వంసం చేయడానికి ట్రంప్ రెడీ అవుతున్నారు: తేల్చి చెప్పిన అమెరికా సెనేటర్
ఉత్తర కొరియాను ధ్వంసం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. సుదీర్ఘ శ్రేణి క్షిపణులను ఉత్తర కొరియా మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా, ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నట్టు ట్రంప్ తనతో స్వయంగా చెప్పినట్టు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ ఎన్బీసీ మీడియా సంస్థకు తెలిపారు. ఉత్తర కొరియా ప్రోగ్రామ్ ను ఇంకా చెప్పాలంటే మొత్తం ఉత్తర కొరియానే నాశనం చేయగల మిలిటరీ ప్రోగ్రాం తమ వద్ద ఉందని ట్రంప్ చెప్పినట్టు వెల్లడించారు.
అమెరికాలోని ప్రతి ప్రాంతాన్ని ఇప్పుడు చేరుకోగలమని, అలాంటి క్షిపణులు ఇప్పుడు తమ వద్ద ఉన్నాయని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్న ప్రకటించిన నేపథ్యంలో, లిండ్సే గ్రాహమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాను చైనా నియంత్రించలేకపోతే, తమకు మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ మిలిటరీ యాక్షన్ మాత్రమే అని ఆయన తెలిపారు. ఖండాంతర క్షిపణులతో అమెరికాపై దాడులు చేయడానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తే, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.