: బుల్లితెర ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేస్తున్న ‘మయూరి’ సుధాచంద్రన్!
సుధా చంద్రన్ గుర్తున్నారా? తెలుగులో ‘మయూరి’ సినిమాతో సంచలనం సృష్టించిన ఈ రియల్ టైం నర్తకి ఇప్పుడు సీరియల్స్‌లో సత్తా చాటుతున్నారు. హిందీలో ‘నాగిని’ సీరియల్‌తో ప్రతిభ చాటిన సుధా చంద్రన్ ఈసారి నెగిటివ్ రోల్‌తో భయపెట్టేందుకు వస్తున్నారు. ఈ మేరకు ఆమె నటిస్తున్న ‘కర్మ ఫలదాత శని’ సీరియల్లోని ఓ పాత్ర ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ సీరియల్లో రాహుకేతువుల తల్లి సింహికగా నెగిటివ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సీరియల్ వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. వివిధ భాషల్లోకి ఈ సీరియల్ డబ్ అవుతోంది. సింహిక పాత్రలో ఉగ్రరూపంతో ఊగిపోతున్న ఆమె రూపం ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది.