rana: ఓ సైనికుడి ప్రేమకథలో రానా!

వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవడంలో రానా ప్రస్తుతం చాలా బిజీగా వున్నాడు. 'ఘాజీ' .. ' నేనే రాజు నేనే మంత్రి' సినిమాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. తాజాగా ఆయన మరో విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నాడని అంటున్నారు. ఈ కథ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాలంలో జరుగుతుందట. ఆయన సైన్యంలోని ఓ సిపాయిగా రానా కనిపిస్తాడని చెబుతున్నారు.

 దేశభక్తితో కూడిన ఆ సైనికుడి ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కథపై కసరత్తు జరుగుతూ ఉందట. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక రానా తాజా చిత్రంగా తెరకెక్కిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా, తెలుగుతో పాటు తమిళంలోను ఆగస్టు 11వ తేదీన విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.    
rana

More Telugu News