sai dhram tej: 'జవాన్'ను యమా టెన్షన్ పెట్టేస్తోన్న బాలకృష్ణ!

షార్ట్స్‌లో చూడండి
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ రవి దర్శకత్వంలో 'జవాన్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పోస్టర్స్ కు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలనుకున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు.

ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన 'పైసా వసూల్' ను సెప్టెంబర్ 29న విడుదల చేయాలనుకున్నారు. ఆ సమయంలో పోటీ ఎక్కువ కావడంతో .. థియేటర్ల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో సెప్టెంబర్ మొదటివారంలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. దాంతో ఇప్పుడు 'జవాన్' సినిమా టీమ్ కి టెన్షన్ పట్టుకుంది. బాలకృష్ణ సినిమాకి పోటీకి దిగడం అంటే కొంచెం ఆలోచించుకోవలసిన అవసరం వుంది. 'జవాన్' టీమ్ సభ్యులు అదే పని చేస్తున్నారట. బహుశా ఈ సినిమాను రెండవ వారానికి వాయిదా వేసుకోవచ్చుననే టాక్ వినిపిస్తోంది.  
Go Back to Shorts
sai dhram tej

More Telugu News