: అతిపొడవైన వేలాడే బ్రిడ్జి... పది వారాల్లో నిర్మాణం పూర్తి
స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్ మ్యాటర్‌హాన్‌లోని అతిపొడవైన వేలాడే పాదచారుల బ్రిడ్జి చార్ల్స్ కౌనెన్ సస్పెన్షన్ బ్రిడ్జిపై పర్యాటకుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 494 మీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి, ఇంతకు ముందు జర్మనీలో ఉన్న అతిపొడవైన వేలాడే బ్రిడ్జి పొడవును దాటేసింది. కేవలం 10 వారాల్లోనే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు. భూమికి 85 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ బ్రిడ్జిని దాటడానికి పర్యాటకులు అమితాసక్తి చూపిస్తున్నారు. కేవలం 65 సెంటీమీటర్లు మాత్రమే నడవగల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జి ద్వారా ఆల్ఫ్స్ పర్వతాల అందాలు చూడటానికి సందర్శకులు క్యూ కడుతున్నారని స్విస్ ఆల్పైన్ రిసార్ట్ నిర్వాహకులు తెలియజేశారు.