nani: నటనలో నానికి పోటీగా నిలిచే సాయిపల్లవి!

నాని ఏ పాత్రను పోషించినా ఆ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. అంత సహజంగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. అందుకే అభిమానులంతా ఆయనని 'నేచురల్ స్టార్' అని ప్రేమతో పిలుచుకుంటూ వుంటారు. ఆయన ఒక సీన్ లో ఉన్నాడంటే... ఆయనతో సమానంగా నటించాలనే ఆలోచనలో మిగతా ఆర్టిస్టులంతా ఉండిపోతారు. ఇక నాని అంతటి సహజంగా నటించడం చాలా కష్టమనే అభిప్రాయాన్ని కొంతమంది కథానాయికలు వ్యక్తం చేస్తూ వచ్చారు.

నటనలో ఆయనతో కాస్త పోటీ పడిన కథానాయికగా ఇంతవరకూ నివేదా థామస్ పేరే వినిపించింది. త్వరలో ఈ ప్లేస్ లో సాయి పల్లవి పేరు వినిపించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాలో నాని జోడీగా సాయిపల్లవి నటిస్తోంది. 'ఫిదా' లో ఆమె నటన చూసిన వాళ్లంతా, 'మిడిల్  క్లాస్ అబ్బాయి'లో నటన పరంగా ఈ అమ్మాయి నానికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. సాయిపల్లవిని నటన పరంగా నాని ఎలా ఎదుర్కుంటాడో చూడాలి మరి.     
nani
sai pallavi

More Telugu News