: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు భార్య శైలజకు యాక్సిడెంట్


మంథని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత పుట్ట మధు భార్య, మంథని సర్పంచ్ శైలజ ప్రయాణిస్తున్న కారు, ఓ లారీని ఢీకొట్టి పల్టీలు కొట్టగా, ఆమెకు గాయాలయ్యాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, వరంగల్ లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరైన ఆమె తిరుగు ప్రయాణం కాగా, భూపాలపల్లి సమీపంలోని కమలాపూర్ వంతెన సమీపంలో ఓ లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో శైలజతో పాటు కారును నడుపుతున్న డ్రైవర్ మల్లేష్ కు గాయాలు అయ్యాయి. గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం, మరో వాహనంలో మంథనికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News