: అంతరిక్షంలో యోగాసనాలు.. ఐఎస్ఎస్‌లో వ్యోమగాముల ప్రయత్నం!
భూమ్మీద కష్టపడి చేయాల్సిన ఆసనాలను అంతరిక్షంలో సులువుగా చేయొచ్చని నిరూపించారు వ్యోమగామి పెగ్గీ విట్సన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తాము యోగా చేస్తున్న ఫొటోలను మరో వ్యోమగామి జాక్ ఫిషర్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. `ఈ విన్యాసాన్ని పెగ్గీ భూమ్మీద కూడా చేయగలదు` అంటూ తమ ఫొటోలను జాక్ షేర్ చేశారు. వాళ్లు ప్రయత్నిస్తున్నది యోగాలో అతికష్టమైన ఆసనం. దాని పేరు పాదంగుష్ట పద్మ ఉత్కటాసన. ఇందులో మొత్తం శరీర బరువును కేవలం ఒక కాలి బొటనవేలు మీద ఆపి, నిల్చోవాలి. అంతరిక్షంలో ఎలాగూ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి చేయడం సులభమే, కానీ యోగా అంతరిక్ష స్థాయికి తీసుకెళ్లినందుకు పెగ్గీని, జాక్‌ని అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.